Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదొక్కటే!: బండ్ల గణేశ్

  • సచిన్ జోషి ఎవరో నాకు తెలియదు 
  • ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ మీద నా బ్యానర్ పేరు వాడుకోవడానికి అంగీకరించాను 
  • ఆ సినిమా వలన ఆయనకి నష్టం వచ్చింది 
  • అందుకు నన్ను కారకుడిని చేద్దామనుకున్నాడు
ఓ సినిమా లావాదేవీలకు సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్ కు .. నటుడు - నిర్మాత అయిన సచిన్ జోషికి మధ్య గొడవలు తెలెత్తాయి. ఈ విషయంలో ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటూ వస్తున్నారు. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఈ విభేదాల విషయం ప్రస్తావనకు రాగా, బండ్ల గణేశ్ తనదైన శైలిలో స్పందించారు.

" నా జీవితంలో నేను చేసిన తప్పు ఏదైనా వుంటే అది ఇదొక్కటే సార్. అసలు సచిన్ అనేవాడితో నాకు పెద్దగా పరిచయం లేదు. ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ మేరకు నా బ్యానర్ పై సచిన్ ఓ సినిమా చేసుకుంటానంటే ఓకే చెప్పాను. నా బ్యానర్ పేరు వాడుకోవడానికి ఒప్పుకున్నాను గానీ .. ఆయనతో నేను సినిమా చేయలేదు. సచిన్ తన డబ్బులు పెట్టుకుని తాను సినిమా చేసుకున్నాడు. లాస్ రావడంతో అందుకు నన్ను బాధ్యుడిని చేయాలనుకున్నాడు. తాను నష్టపోవడానికి నేను కారణమంటూ కోర్టుకు ఎక్కాడు .. పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టాడు .. దాంతో నేను పరువు నష్టం దావా వేశాను" అంటూ చెప్పుకొచ్చారు.         
bandla ganesh
sachin joshi

More Telugu News